మేమిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే  

Kajal and Rana Friendship

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ సినిమాలో క‌లిసి న‌టించిన హీరో హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయితే వారిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న గాసిప్స్ రావ‌టం స‌హ‌జం. నేనే రాజు నేనే మంత్రి హీరో హీరోయిన్లు రానా, కాజ‌ల్ పై ఇప్పుడు ఇలాంటి క‌బుర్లే వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తోంది.

తేజ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్ జోడీ బాగుంద‌నే టాక్ వ‌చ్చింది. సినిమా విడుద‌ల‌కు ముందే రిలీజ‌యిన టీజ‌ర్ లో రానా, కాజ‌ల్ ను చూసిన వారంతా హిట్ పెయిర్ అన్నారు. ప‌నిలో ప‌నిగా వారిద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌నే వార్త‌లూ వినిపిస్తున్నాయి. షూటింగ్ స‌మయంలో రానా, కాజ‌ల్ మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని, వాళ్లిద్ద‌రూ ఒక‌ళ్ల‌ను విడిచి ఒక‌ళ్లు ఉండ‌టం లేద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఈ పుకార్లలో ఎంత‌వ‌రకూ నిజ‌ముందో తెలియ‌దు కానీ..రానా ఇప్ప‌టిదాకా దీనిపై పెద‌వి విప్ప‌లేదు. కాజ‌ల్ మాత్రం తొలిసారి స్పందించారు. ఇలాంటి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆమె అభిమానుల‌ను కోరారు. చాలా కాలంనుంచి తామిద్ద‌రం స్నేహితుల‌మ‌ని, త‌మ మ‌ధ్య స్నేహం త‌ప్ప మ‌రేమీ లేద‌ని కాజ‌ల్ చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ లో త‌మ మ‌ధ్య ప్రేమ చిగురించింద‌న్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు.

రానా క‌ష్ట‌ప‌డే వ్య‌క్తి అని, బాహుబ‌లి సినిమాతో రానాకు రావ‌ల్సిన గుర్తింపు ల‌భించింద‌ని చెప్పారు. రానా, కాజ‌ల్  మీద వ‌చ్చిన వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కూ నిజ‌ముందో తెలియ‌దు కానీ..గ‌తంలో వేరే వ్య‌క్తుల‌తో క‌లిసి వీరిద్ద‌రి పేర్లూ వినిపించాయి. రానా పేరు  చానాళ్లుగా త్రిష‌తో క‌లిసి వినిపించ‌గా…కాజ‌ల్ న‌వ‌దీప్ మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచింద‌న్నపుకార్లు గ‌తంలో ఉన్నాయి. నేనే రాజు నేనేమంత్రి ఇప్పుడు ఈ ఇద్ద‌రి పేర్లూ క‌లిపి వినిపిస్తున్నాయి. భార్య‌ను అమితంగా ప్రేమించే పాత్ర‌లో ఒదిగిపోయిన రానా..నిజ‌జీవితంలోనూ మంచి ప్రేమికుడ‌ని, నాగ‌చైత‌న్య‌, స‌మంత లానే రానా, కాజ‌ల్ ప్రేమించి పెళ్లిచేసుకుంటే బాగుంటుంద‌ని అభిమానులంటున్నారు.

మరిన్ని వార్తలు: