సెహ్వాగ్ పై నెటిజ‌న్ల మండిపాటు

Netizens Unhappy With Sehwag Tweets

Posted August 13, 2017 at 15:24 

 Netizens Unhappy With Sehwag Tweets

 ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు కామెంట్లు చేస్తూ త‌న ట్వీట్ల‌పై అంద‌రికీ ఆస‌క్తి పెంచే టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ చిక్కుల్లో ప‌డ్డాడు. తాజా ఘ‌ట‌న‌ల‌పై అప్ డేట్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిప్రాయం చెప్పే సెహ్వాగ్ గోర‌ఖ్ పూర్ విషాదంపై కొన్ని కామెంట్స్ పోస్ట్ ఛేశారు. అమాయ‌క  పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయినందుకు బాధ‌గా ఉంద‌ని సెహ్వాగ్ అన్నారు.  దేశంలో ప్ర‌తి ఒక్క‌రి ప్రాణం విలువైంద‌ని, మ‌నిషి జీవితం క‌న్నా గొప్ప‌ది ప్ర‌పంచంలో మరేదీ లేద‌ని ట్వీట్ చేశారు. 

1978లో మెద‌డు వ్యాపు వ్యాధి ప్ర‌బ‌లిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా దేశంలో  మొత్తం 50 వేల మందికి పైగా చిన్నారులు చ‌నిపోయార‌ని…అదే 1978లో తాను జ‌న్మించాన‌ని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ల‌పైనే ఇప్పుడు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. గోర‌ఖ్ పూర్ లోని బీఆర్ దాస్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ అంద‌క చిన్నారులు చ‌నిపోతే…సెహ్వాగ్ ట్వీట్లు మాత్రం మెద‌డు వ్యాపువ్యాధికి గురై  చిన్నారులు మ‌ర‌ణించినార‌నే అర్ధం వ‌చ్చేలా ఉన్నాయ‌ని, దుయ్య‌బ‌డుతున్నారు.

చిన్నారుల మ‌ర‌ణంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఆయ‌న ఎందుకు ఎత్తిచూప‌టం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో 70 మంది చిన్నారులు చ‌నిపోతే…సెహ్వాగ్ ఎందుకు స్పందించం లేద‌న్న నెటిజ‌న్లు బీజేపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ధైర్యం సెహ్వాగ్ కు లేద‌ని విమ‌ర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

SHARE