గవర్నర్ పోస్టుకు హైస్కూల్ కుర్రాళ్ల పోటీ

High School Children In Competition For Governor Post

Posted August 13, 2017 at 11:40 

High School Children In Competition For Governor Post

అమెరికాలో అన్నీ ప్రపంచం కంటే ముందుగానే జరుగుతాయి. అందుకు నిదర్శనమే టీనేజ్ కుర్రాళ్లు గవర్నర్ కుర్చీ కోసం పోటీ పడటం. అసలు ఓటుహక్కే లేని వీరిద్దరూ గవర్నర్ పదవుల కోసం రంగంలోకి దిగారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పదవికి ఎన్నేళ్లు ఉన్నవారు పోటీపడాలో స్పష్టంగా లెక్కలున్నాయి. కానీ కాన్సాస్, వర్మాంట్ లాంటి రాష్ట్రాల్లో ఆ లెక్కలేవు. అందుకే వీళ్లు బరిలోకి దిగారు.

మరి పిల్లలే కదా జనం సీరియస్ గా తీసుకుంటున్నారా అనుకుంటున్నారా. అది అమెరికా అండి. అందుకే పిల్లల ప్రచారానికి కూడా బాగానే విరాళాలు పోగయ్యాయి. కానీ చాలా మంది ప్రజలు మాత్రం షరా మామూలుగా పెద్దగా పట్టించుకోవడం లేదట. అయితే ఎన్నికలకు ఇంకా చాలా టైముంది కాబట్టి ఆలోగా సంచనాలు జరగకపోతాయా అని వీరిద్దరూ ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే బ్రహ్మాండం బద్దలైనట్లే.

పిల్లల కామెడీ షో గవర్నర్ పదవికి పోటీపడుతున్నట్లు ప్రకటించడమై ఓ విశేషమైతే.. రెగ్యులర్ అభ్యర్థులకు దీటుగా విరాళాలు సేకరించడం మరో ఎత్తు. మరి పిల్లలు నిజంగా సీరియస్ గా పోటీ చేస్తున్నారా.. లేదంటే ట్రై చేద్దాం అనుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది. ఏమో రెగ్యులర్ గవర్నర్ల కంటే పిల్లలైతే బాగా పనిచేస్తారని ఓటర్లు అనుకుంటే మాత్రం పిల్లల గెలుపు ఖాయమవుతుంది.

మరిన్ని వార్తలు:

SHARE