పొలిటికల్ స్క్రీన్ పై అంజలి

Indian Film Actress Anjali Visits Parliament

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించేసిన హీరోయిన్ అంజలి.. తమిళ్ లో మాత్రం ఇంకా రైజింగ్ లోనే ఉంది. అచ్చమైన గోదావరి యాస మాట్లాడే తెలుగు పిల్ల అంజలి రాజకీయాలపై మోజు పడుతోంది. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి పార్లమెంటును చూసొచ్చింది. ఇప్పటిదాకా నేతలంతా పార్టీలు పెట్టో, రాజకీయాల్లో ఎంపీలుగా గెలిచో పార్లమెంటు విజిట్ చేశారు. కానీ అంజలి ముందే చూసిరావడం విచిత్రంగా కనిపిస్తోంది.

పార్లమెంటుకు వెళ్లిన అంజలి.. అక్కడో పార్టీ అధినేతను కలిసిందని, వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుకు ఆశీస్సులు పొందిందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎంపీగా గెలవాలంటే టీడీపీ, లేదా వైసీపీలో చేరాలి, మరో పార్టీకి స్కోప్ లేదు. ప్రధాన పార్టీల అధినేతలు అమరావతిలో ఉన్నారు. మరి హస్తినలో ఎవర్ని కలిసిందని ఊహాగానాలు వస్తున్నాయి.

అంజలికి తమిళం, కన్నడ లో కూడా పాపులారిటీ ఉంది కాబట్టి.. ఆ రాష్ట్రం నుంచి బరిలోకి దిగుద్దేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ అంజలి ఎంత పాపులరైనా ఎంపీగా గెలిచేంత స్టార్ డమ్ లేదని జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు ప్రధాన పార్టీల అండ లేకుండా అమె ఎంపీగా గెలవడం కష్టమే. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ పాపులరైన అంజలి.. ఏం ఆశించి ఈ రూమర్లు స్ప్రెడ్ చేస్తుందో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు:

నాయ‌కుడు కావ‌లెను

ఆప‌రేష‌న్ గుజ‌రాత్ ప్రారంభించిన హ‌స్తం

స‌రిహ‌ద్దుల‌కు భారీగా సైన్యం త‌ర‌లింపు