మోడీ మాట బాబా చెప్పారా..?

ramdev-baba-has-now-commented-china

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నరేంద్ర మోడీ పీఎం అయ్యాక అంబానీ, అదానీ కంటే ఎక్కువ సంపాదించిన వ్యక్తి యోగా గురు బాబా రాందేవ్. కాంగ్రెస్ హయాంలో సాధారణ యోగా గురువుగా ఉన్న బాబా.. పతంజలి బ్రాండ్ పేరుతో కొన్ని ఆయుర్వేద ఔషధాలు మాత్రమే విక్రయించేవారు. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన కోటీశ్వరుడైపోయాడు. ఏకంగా హిందుస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ లాంటి టాప్ కంపెనీలను తోసిరాజని కన్యూజమర్ గూడ్స్ లో నంబర్ వన్ అయిపోయారు. ఇంత తక్కువకాలంలో అన్ని చైన్ సూపర్ మార్కెట్లు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.

అలాంటి రాందేవ్ బాబా ఇప్పుడు చైనా మీద కూడా శ్రుతి మించి వ్యాఖ్యలు చేశారు. చైనాకు శాంతిగా చెబితే అర్థం కాదని, యుద్ధంలోనే వారు అన్నీ అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. భారత్ శాంతిని కాంక్షించిన ప్రతిసారీ డ్రాగన్ ఎక్స్ ట్రాలు చేసిందని, అందుకే మనం యుద్ధం కోరుకుంటే.. చైనా తగ్గుతుందని బాబా విశ్లేషిస్తున్నారు.

యోగా గురువు యోగా చేయకుండా పాలిటిక్స్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన అనుచరుల్లో కలకలం మొదలైంది. మోడీకి సన్నిహితంగా ఉండే రాందేవ్ బాబాకు చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రదాని చెప్పారా అనే సందేహాలు వస్తున్నాయి. ఎంతైనా బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కీలక విషయాలపై మౌనంగా ఉంటూ బాబాలు, స్వామీజీలతో మాట్లాడించే టెక్నిక్ అలవాటు చేశారు మోడీజీ.

మరిన్ని వార్తలు: