కాంగ్రెస్ ఇక మారదా..?

kuntiya-comments-on-ysrcp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అధికారం పోయినా టీకాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదు. ఓవైపు కుంతియా వచ్చి కలిసి పనిచేయమని చెబుతుంటే.. నేతలు మాత్రం పరస్పర ఫిర్యాదులతోనే కాళం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణంగానే తెలంగాణలో అధికారం పోయిందన్న కుంతియా వ్యాఖ్యలు ఇంకా కామెడీగా ఉన్నాయి. కిరణ్ ఆ మాత్రం నిలబడకపోతే.. కాంగ్రెస్ ఉనికి కూడా ఉండేది కాదనే విషయం ఆయనకు తెలియదు కాబోలు.

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్.. ఇప్పుడు సెటిలర్లను ఉద్ధరిస్తామని కబుర్లు చెబుతోంది. అసలు హైదరాబాద్ ను తమకు దూరం చేసిన కాంగ్రెస్ కు సెటిలర్లు ఎలా ఓటేస్తారనుకుంటున్నారో వారికే తెలియాలి. కాంగ్రెస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొహం మొత్తింది. అయినా తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ తమదే అనుకున్నప్పుడు ఒరిజినల్ తెలంగాణ వారిని వదిలేసి.. సెటిలర్లపై కన్నేయడమేంటో ఆ పార్టీయే సెలవీయాలి.

తెలంగాణలో కోటి మంది సెటిలర్లే అనే లెక్క కరెక్టే. కానీ వారంతా రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని, తప్పనిసరై టీఆర్ఎస్ కు ఓట్లేస్తున్నారనీ కాంగ్రెస్ కు తెలుసు. అన్నీ తెలిసీ వారిని తమవైపు తిప్పుకోవాలని కలలు కనడం కంటే కామెడీ మరొకటి లేదు. కాంగ్రెస్ ఇప్పటికైనా వాస్తవలోకం లోకి రాకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఉన్న సీట్లు కూడా రావంటున్నారు కార్యకర్తలు.

మరిన్ని వార్తలు: