రానా సినిమా గురించి వర్మ ఏమన్నాడంటే..!

ram gopal varma comments on Rana Nene Raju Nene Mantri movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల వేరే హీరోల మరియు దర్శకుల సినిమాల గురించి ఎక్కువగా కామెంట్స్‌ చేయడం మనం గమనించవచ్చు. అంతకు ముందు వారం విడుదలైన తన శిష్యుడి సినిమా ‘నక్షత్రం’ చిత్రాన్ని చూసి చుక్కలు చూపిందని, కృష్ణవంశీ కూడా తన దారిలో నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా పోస్ట్‌ చేయడం జరిగింది. ఇక మొన్న విడుదలైన మూడు సినిమాల్లో తనకు రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం నచ్చింది అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ చిత్రంతో విడుదలైన మిగిలిన రెండు సినిమాల గురించి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు అంటూ వర్మ పేర్కొన్నాడు.

వర్మ ఇంకా స్పందిస్తూ.. ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడిగా బాడీని మాత్రమే చూపించిన రానా ఈ సినిమాలో నటనతో అద్బుతం అనిపించాడు. గ్రీక్‌ దేవుడు మాదిరిగా రానా ఈ సినిమాలో కనిపించాడంటూ వర్మ పొగడ్తల వర్షం కురిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇప్పుడు రానా గురించి మాట్లాడుకుంటున్నారని వర్మ అభిప్రాయ పడ్డాడు. వర్మకంటే ముందు రాజమౌళి ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఒక అద్బుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పుడు వర్మ కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో చిత్రం తడిసి ముద్దవుతుంది. కలెక్షన్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ సినిమా ‘బాహుబలి’ కాకుండా రానా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించగా కాజల్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

ప్రకాష్‌ రాజ్‌ తీరుపై మళ్లీ విమర్శలు

ఆ ఘ‌ట‌నే ఈ సినిమా క‌థ‌కు మూలం

‘సాహో’ హీరోయిన్‌ ఫైనల్‌