రాజీనామాకి సిద్ద పడ్డ కర్ణాటక సీఎం !

కర్ణాటకలో రాజకీయ వివాదం మరింత ముదురుతుంది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్-జేడీఎస్ ఇప్పుడు ఉప్పు నిప్పులా మారుతున్నాయి. కాంగ్రెస్ నేతలు జేడీఎస్ నేత కుమార స్వామి సీఎం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఎక్కువ సీట్లు సాధించి కూడా తమకు సీఎం పదవి దక్కలేదన్న అక్కసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నెలకొందట. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని జేడీఎస్‌ తో జతకట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా కూడా కాంగ్రెస్ అసంతృప్తులు మాత్రం తమ అక్కసును వీలు దొరికినప్పుడల్లా వెళ్లగక్కుతూనే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై విసిగిన సీఎం కుమార స్వామి వారికి హెచ్చరికలు జారీ చేశారు. హస్తం నేతలు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను తీవ్రంగా అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. పరిస్థితి ఇలాగా ఉంటే తాను ముఖ్యమంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఇక కాంగ్రెస్‌తో కలిసి ఉండటం కష్టమని నాకు తెలుస్తుందన్నారు.

రాజీనామాకి సిద్ద పడ్డ కర్ణాటక సీఎం ! - Telugu Bullet

కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటూ మండిపడ్డారు. కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యతో కర్ణాటక రాజకీయాల్లో కుదుపు ప్రారంభమైంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సీఎం. అయితే కుమారస్వామిని వ్యతిరేకిస్తున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యే సిద్ధరామయ్య వర్గానికి చెందినవారని తెలుస్తుంది. దీంతో సిద్ధరామయ్య, కుమారస్వామి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. కర్నాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. ఎక్కువ సీట్లు సాధించి కూడా కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయలేని కమలనాథులు మరోసారి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్ నేతలకు , ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. మరి ఇప్పుడు కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ సమర్దించారు ఆయన అలా అనుకోవడం తప్పులేదని కానీ మా సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన చిక్కేమీ లేదని ఆయన పేర్కొన్నారు