చైతూ అడ్డు రాకుంటే సమంతను పెళ్లి చేసుకునేవాడిని..!

sai dharam tej wants to marriage with samantha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ అయిన చైతూ మరియు సమంతలు అక్టోబర్‌లో వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ పూర్తి అవ్వగా పెళ్లికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ సమయంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యంకు గురి చేశాయి. తాజాగా ఈయన ‘జవాన్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌తో పాటు నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌లోని ఒక పోలీస్‌ క్వార్టర్స్‌లో పోలీసులతో కలిసి సందడి చేశారు. అక్కడి వారు అడిగిన ప్రశ్నలకు సాయి జోక్‌గా, జోవియల్‌గా, సరదాగా సమాధానం చెప్పి అందరిని ఉత్సాహపర్చారు.

ఆ సమయంలోనే ఒక వ్యక్తి మీకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు అంటూ ప్రశ్నించారు. అందుకు సమాధానంగా సాయి మాట్లాడుతూ.. తనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్‌ సమంత అని, సమంతతో తాను ప్రేమలో పడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక వేళ చైతూ ఆమెను పెళ్లి చేసుకోకుంటే, ప్రేమించకుంటే నేను సమంతకు ప్రపోజ్‌ చేసేవాడిని అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. సమంతతో కలిసి నటించాలనే కోరిక ఉందని, కాని అది తీరుతుందని తాను భావించడం లేదు అని అన్నాడు. ఇక మామయ్యలు చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌లు అంటే ఇష్టం అని, రవితేజ ఎనర్జిలెవల్స్‌ కూడా తనకు బాగా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. హీరోయిన్‌ రెజీనాతో సినిమా చేయడం అంటే ఇష్టపడతాను అన్నాడు. సాయి ‘జవాన్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని వార్తలు:

రవి తేజ ‘రాజా ది గ్రేట్’ టీజర్