అభివృద్ధి, సంక్షేమం రెండు చ‌క్రాలు

kcr flag hoisting on independence day 2017

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చ‌క్రాల‌పైనే తెలంగాణ ప్ర‌భుత్వ బండి న‌డుస్తోంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోట‌లో నిర్వహించిన 71వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొని త్రివర్ణ ప‌తాకాన్ని ఆవిష్కిరించారు. స్వాతంత్ర్య ఉద్య‌మ స్ఫూర్తితో అహింసా ప‌ద్ధ‌తిలో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లందుకుంటున్నాయ‌ని చెప్పారు. సాధార‌ణంగా కొత్తగా ఏర్ప‌డిన రాష్ట్రాలు తొంద‌ర‌గా కుదురుకోలేవ‌ని, కానీ తెలంగాణ దాన్ని అధిగ‌మించింద‌ని, ప‌టిష్ట‌మైన ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల్లే ఈ ఫ‌లితం వ‌చ్చింద‌ని కేసీఆర్ అన్నారు. స‌మాన‌త్వం, సామాజిక న్యాయం సాధించేదిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక రూపొందిస్తోంద‌ని చెప్పారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి కేసీఆర్ వివ‌రించారు. రాష్ట్రం ఆవిర్భ‌వించాక విద్యుత్ క‌ష్టాలు తీరిపోయాయ‌ని, ప్ర‌స్తుతం ఇంటికీ, వ్య‌వ‌సాయానికి 24 గంట‌లూ క‌రెంటు స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లుగుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంపు కోసం విద్యుదుత్ప‌త్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామ‌ని త్వ‌ర‌లోనే తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆవిర్భ‌విస్తుంద‌ని కేసీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తలు:

కీల‌క విష‌యాల్లో ప్ర‌జ‌లు అండ‌గా నిలిచారు

ఎన్సీపీ అందుకే దూరమైందా..?

ఉత్తరాది గర్వం తలకెక్కింది