న‌వ్యాంధ్ర‌ను నంబ‌ర్‌ వ‌న్ చేద్దాం

chandrababu flag hoisting on independence day 2017 at tirupati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

న‌వ్యాంధ్ర‌లో మాన‌వ వ‌న‌రుల‌కు కొద‌వ లేద‌ని, వారంతా రాష్ట్రాన్ని దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుప‌తిలోని తార‌క‌రామ మైదానంలో నిర్వ‌హించిన 71వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో సీఎం పాల్గొని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. స్వాతంత్ర్యం కోసం తెలుగువాళ్లు ఎంతోమంది ప్రాణ‌త్యాగాలు చేశార‌ని, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించార‌ని, ఆయ‌న్ను త‌ల‌చుకుంటే ఇప్ప‌టికీ ఆవేశం వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ఉత్తేజంగా అన్నారు. స్వ‌తంత్ర దినోత్స‌వాలు జ‌రుపుకుంటున్న వేళ దేశం కోసం త్యాగాల‌ను చేసిన మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చెప్పారు. ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద ప్ర‌జాస్వామ్య‌దేశ‌మైన భార‌త్ లో సాధార‌ణ స్థాయి నుంచి వ‌చ్చిన ఎంద‌రో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించార‌ని ఎన్డీఆర్, మోడీ లాంటివారే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని చంద్ర‌బాబు అన్నారు.  అతి సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన మోడీ ప్ర‌పంచం మొత్తం మెచ్చే ప్ర‌ధాని అయ్యార‌ని, ఇదే ప్ర‌జాస్వామ్యం గొప్ప‌త‌న‌మ‌ని ప్ర‌శంసించారు. న‌వ్యాంధ్ర ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య వేడుక‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని,

దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ ఈ విధానం లేద‌ని బాబు చెప్పారు.  ఈ సారి ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో వేడుక‌లు నిర్వ‌హిస్తుండ‌టం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్న బాబు,తిరుప‌తి త‌న‌కు జ‌న్మ‌నిస్తే..వెంక‌టేశ్వ‌ర‌స్వామి పున‌ర్జ‌న్మ ఇచ్చార‌ని, అలిపిరిలో జ‌రిగిన దాడినుంచి ఆయ‌నే త‌న‌ను కాపాడార‌ని వ్యాఖ్యానించారు.  రాష్టంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం క‌ల్పిస్తున్నామ‌ని, అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామని,  రాష్ట్రాభివృద్ధి ల‌క్ష్యాల‌ను వివ‌రించారు చంద్ర‌బాబు

మరిన్ని వార్తలు:

కీల‌క విష‌యాల్లో ప్ర‌జ‌లు అండ‌గా నిలిచారు

ఎన్సీపీ అందుకే దూరమైందా..?

ఉత్తరాది గర్వం తలకెక్కింది