ఎన్సీపీ అందుకే దూరమైందా..?

ncp party leaders angry on congress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల తర్వాత అమిత్ షాను దెబ్బకొట్టడం కష్టం కాదని కాంగ్రెస్ కు తెలిసొచ్చింది. అంతేనా ఇప్పటిదాకా తీవ్ర విమర్శలు ఎదుర్కున్న అహ్మద్ పటేల్ ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఏకంగా గుజరాత్ మాదేనని స్టేట్ మెంట్ ఇచ్చేదాకా వెళ్లింది వ్యవహారం. కానీ సీన్ మాత్రం వేరే ఉంది. అసలు కాంగ్రెస్ లో మొన్న ఓటేసిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి గోడ దూకడానికి రెడీగా ఉన్నారట.

గుజరాత్ కాంగ్రెస్ కు ఇప్పటిదాకా నావికుడే లేడు. కానీ ఇప్పుడు నౌకే లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇది చాలదన్నట్లు మిత్రులు కూడా కాంగ్రెస్ కు షాకులిస్తున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం కోలుకోలేని షాకిస్తే.. నమ్మకమైన మిత్రపక్షం ఎన్సీపీ కూడా ఖో చెప్పింది. అనారోగ్యమని పవార్ చెబితే.. విపక్షాల సమావేశాన్ని బహిష్కరించామని ప్రపుల్ పటేల్ ప్రకటించడం కాంగ్రెస్ కు షాకిచ్చింది.

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో జేడీయూ, ఎన్సీపీ ఓట్లతోనే అహ్మద్ పటేల్ గట్టెక్కారు. అందుకే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లకపోయినా ప్రాబ్లమ్ కాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్సీపీనే అనుమానంగా చూస్తోందట. వారిద్దరి సభ్యులు అహ్మద్ పటేల్ కు ఓటేయలేదని చెబుతోందట. దీంతో ఎన్సీపీ అరికాలి మంట నెత్తికెక్కింది. పోనీలే పాపమని ఓటేస్తే ఇలా ప్రచారం చేస్తున్నారని, అందుకే ఇక దూరంగానే ఉంటామని కుండబద్దలు కొట్టారు ప్రపుల్ పటేల్.

మరిన్ని వార్తలు:

ఉత్తరాది గర్వం తలకెక్కింది

రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తారా..?

పవన్ నాన్ సీరియస్సేనబ్బా..?