పవన్ నాన్ సీరియస్సేనబ్బా..?

pawan kalyan wants to do padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమాల్లో పవర్ స్టారే కానీ.. రాజకీయాల్లో మాత్రం పవన్ స్టార్ కూడా కాదు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతనే ఉండదు. ఏదో ఉద్దానాన్ని ఉద్ధరించేస్తున్నట్లు పోజు కొట్టి.. చివరకు హర్వర్డ్ బృందాన్ని బాబు దగ్గరకు తీసుకెళ్లారు. అంటే సింగిల్ గా డీల్ చేయడం చేతకాదనేగా. ఆ మాత్రం తెలివి రాజకీయ నాయకులకు లేదని పవన్ అనుకుంటున్నారేమో.

ఇక పాదయాత్ర చేస్తా.. అదీ అభిమానులు చేయనిస్తే అన్న పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి. తమ అభిమాన హీరో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంటే అభిమానులు అడ్డుపడతారా అన్న ప్రశ్నకు పవన్ దగ్గర ఆన్సర్ లేదు. ఉన్నా చెప్పరు. ఇప్పటికే పవన్ తన గురించి తాను అతిగా ఊహించుకుంటున్నారు. పవన్ కంటే ఎన్నో రెట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి కూడా ఇన్ని సొల్లు కబుర్లు చెప్పలేదు.

ఏపీలో పాదయాత్ర చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు మాత్రం నోరు విప్పడం లేదు. పైగా తన చేతిలో ఉన్న సినిమాలు కూడా నింపాదిగా చేసుకుంటూ వెళ్తున్నాడు. కాన చక చకా ఫినిష్ చేద్దామనే ఆలోచనే ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పవన్ ను నమ్ముకుని ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు జనసేనలో చేరిపోతున్నారన్న ప్రచారానికి మాత్రం లోటేమీ లేదు. ఇదే రాజకీయాల్లో చోద్యం.

మరిన్ని వార్తలు:

అదే నిజమైతే ఉలికెందుకు..?

స్వతంత్ర భారత్ అనుకున్నది సాధించిందా..?

మా అధ్యక్షుడు ఎమ్మెల్యే కానున్నాడా?