దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఆమె వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జేడీ శీలం, తులసిరెడ్డి, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు.