ప్రయోగానికి ఓకే చెప్పిన ఎన్టీఆర్‌!

ntr to do with chandra sekhar yeleti

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
స్టార్‌ హీరోలు కమర్షియల్‌ సినిమాలనే ఎక్కువ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా తెలుగులో కమర్షియల్‌ సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు ఆధరిస్తారు. కమర్షియల్‌ సినిమాలతోనే హీరోలకు స్టార్‌ డం వస్తుంది. అందుకే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రతి హీరో కూడా కమర్షియల్‌ సినిమాలను చేసేందుకు ఇష్టపడతారు. చాలా అరుదుగా, సంవత్సరంలో ఒక్కటి లేదా రెండు చిత్రాలు మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలు స్టార్స్‌ నుండి వస్తాయి. ఆ చిత్రాలు వారికి పేరును తీసుకు వస్తాయేమో కాని, కలెక్షన్స్‌ను మాత్రం తీసుకు వచ్చింది లేదు. అయినా కూడా ఎన్టీఆర్‌ వచ్చే సంవత్సరం ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. ఈయనతో ఎన్టీఆర్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాల కారణంగానే ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ప్రయోగాత్మకంగా ఉండటంతో పాటు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండే చిత్రాన్ని దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించేందుకు కథను సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమా వచ్చే జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా పూర్తి అయిన తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో సినిమా ఉంటుందని తేలిపోయింది. వరుసగా కమర్షియల్‌ సక్సెస్‌లు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం చేస్తే పెద్దగా నష్టం ఏమీ లేదు. అందుకే ఎన్టీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

రవి తేజ ‘రాజా ది గ్రేట్’ టీజర్