ప్రయోగాలకు ఇక స్వస్థి

rana to do action movie with Boyapati srinu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ వారసుడు అయిన రానా మొదటి సినిమా చాలా సింపుల్‌గా తెరకెక్కింది. సహజంగా అయితే భారీ బడ్జెట్‌తో, పూర్తి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఎంట్రీ ఉండాలి. కాని రానా మాత్రం మొదటి నుండి కూడా ప్రయోగాత్మక చిత్రాలపై ఆసక్తి చూపించాడు. ఆ ఆశక్తితోనే ‘లీడర్‌’ ఆ తర్వాత పలు చిత్రాలను చేయడం జరిగింది. ‘బాహుబలి’ చిత్రంలో విలన్‌గా నటించినందుకు రానాకు భారీ క్రేజ్‌ దక్కింది. ఇక తాజాగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను అందుకున్న నేపథ్యంలో రానా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇకపై పూర్తిగా కమర్షియల్‌ చిత్రాలే చేస్తాను అని, ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో అలాంటి చిత్రాలు చేస్తాను అంటూ సన్నిహితులతో రానా చెప్పుకొచ్చాడు. మరో కమర్షియల్‌ సక్సెస్‌ కోసం రానా తాపత్రయ పడుతున్నాడు. యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానా ఒక భారీ యాక్షన్‌ సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. సురేష్‌బాబు కూడా అందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి ‘జయ జానకి నాయక’ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత చిరంజీవితో మరియు బాలయ్యలతో సినిమాలు చేస్తాడు. ఆ తర్వాత రానాకు బోయపాటి ఓకే చెప్తాడేమో చూడాలి. ఈ గ్యాప్‌లో రానా రెండు చిత్రాలు చేసే అవకాశాలున్నాయి. అవి కూడా మాస్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసి ఉంటాయని సమాచారం. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా రానా ‘నెం.1 యారి విత్‌ రానా’ షోతో సక్సెస్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు:

పవన్‌ ‘రాజు వచ్చినాడు’..!

నిరాశ పర్చిన అల్లు అర్జున్‌

నాగగచైతన్య “సవ్యసాచి”… అంటే ?