సిద్ధార్థ్ “చిన్నా” ఓటీటీలోకి వస్తోంది!

సిద్ధార్థ్ “చిన్నా” ఓటీటీలోకి వస్తోంది!
Cinema News

టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ డ్రామా “చిన్నా”. మరి తమిళ్ లో భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ని సిద్ధార్థ్ ఇతర భాషల్లో కూడా విడుదల చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అయితే తెలుగులో మాత్రం తనకి మొదట చేదు అనుభవం ఎదురైనప్పటికీ తాను రిలీజ్ చేసాక ఈ చిత్రం తెలుగులో కూడా మంచి సక్సెస్ అని అయితే సాధించింది.

సిద్ధార్థ్ “చిన్నా” ఓటీటీలోకి వస్తోంది!
Chinna Movie

మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించగా ఫైనల్ గా ఈ సినిమా అయితే ఓటిటి డెబ్యూ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అయితే ప్రముఖ సంస్థ డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా, ఇందులో ఈ చిత్రం ఈ నవంబర్ 17 నుంచి అయితే స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

మరి అప్పుడు కానీ మిస్ అయ్యినవారు ఉంటే ఈ సినిమా ని ఓటిటి లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించగా తెలుగులో ఆసియన్ సినిమాస్ వారు రిలీజ్ చేశారు.