శింబు మాటలకు హద్దు లేకుండా పోతుంది

Simbu says Maniratnam is my FAN we will do movie soon

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాడ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న శింబు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదం అవుతూనే ఉన్నాడు. ఆ మద్య ఒక నిర్మాతకు డేట్లు ఇచ్చి షూటింగ్‌కు హాజరు కాకుండా ఉండటంతో పాటు, తాను అనుకున్న లొకేషన్స్‌లోనే షూటింగ్‌ చేయాలని పట్టుబట్టిన శింబు డబ్బింగ్‌ చెప్పేందుకు స్టూడియోకు రాకుండా బాత్‌రూంలో వాయిస్‌ రికార్డర్‌ ద్వారా డైలాగ్స్‌ను రికార్డ్‌ చేసి పంపించాడట. ఇలా శింబు గురించి చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. దర్శకులు, నిర్మాతలు ఇలా అంతా కూడా ఆయన్ను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనపై అనధికారిక బ్యాన్‌ అమలు అవుతుందని కోలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ఆ మద్య మణిరత్నం దర్శకత్వంలో శింబు ఒక సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ సినిమా ఏవో కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి మళ్లీ చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాని అందులో నిజం లేదని, ఒక గొడవ కారణంగా సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. శింబు ఇంకా మాట్లాడుతూ… ఆ గొడవ తర్వాత కూడా మణిరత్నం తనతో మరో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నాడు. కారణం నేను అంటే మణిరత్నంకు అభిమానం, ఆ అభిమానంతోనే తాను నన్ను వదలలేక పోతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి శింబు మాటలకు హద్దు పద్దు లేకుండా పోతున్నాయి. గొప్ప దర్శకుడు అయిన మణిరత్నం తనకు ఫ్యాన్‌ అంటూ చెప్పడంలోనే ఆయన ఏ స్థాయి బలుపును ప్రదర్శిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. శింబు కెరీర్‌ అర్థాంతరంగా ముగిసి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.