నన్ను వేదించడం వల్లే పవన్‌పై వ్యాఖ్యలు

another-time-kathi-mahesh-comments-on-pawan-kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ను కత్తి మహేష్‌ వదిలేలా లేడు. సందర్బం వచ్చినప్పుడల్లా కత్తి మహేష్‌ తనదైన శైలిలో పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం జరుగుతుంది. కత్తి మహేష్‌ తాజాగా మరోసారి పవన్‌ కళ్యాణ్‌ గురించి వివాదాస్పదంగా మాట్లాడాడు. ప్రస్తుతం పవన్‌ ఏపీలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఆ పర్యటనను ఉద్దేశించి కత్తి మహేష్‌ మాట్లాడుతూ పవన్‌ పర్యటన ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు. ఒకటి తన అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్‌ కాగా, రెండవది తన పార్టీ ఉందని, తాను ఒక రాజకీయ నాయకుడిని అని చెప్పేందుకు ఉపయోగం అంటూ కాస్త ఎటకారంగా కత్తి మహేష్‌ వ్యాఖ్యలు చేశాడు.

kathi-mahesh

కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై మరోసారి పవన్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేశారు. పవన్‌ ఫ్యాన్స్‌ మళ్లీ కత్తి మహేష్‌ను టార్గెట్‌ చేశారు. కత్తి మహేష్‌కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. కత్తి మహేష్‌ తనపై పవన్‌ అభిమానులు చేస్తున్న విమర్శలకు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనను పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు టార్గెట్‌ చేసి వేదించారు. అందుకే ఇప్పుడు తాను పవన్‌ను టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేస్తున్నాను అని, పవన్‌ తన విషయంలో ఆయన ఫ్యాన్స్‌ వ్యవహరించిన తీరుకు స్పందించాలని, అప్పటి వరకు తన వ్యాఖ్యలు ఉంటూనే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం కత్తి మహేష్‌ స్థాయికి పవన్‌ స్పందించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం కొనసాగుతూ వెళ్తుంది. ఇది ఎంత వరకు వెళ్తుంది అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు.