విశాఖ సింగపూర్ కొత్త విమాన సర్వీస్

విశాఖ సింగపూర్ కొత్త విమాన సర్వీస్

ఇది వరకి విశాఖపట్నం నుంచి సింగ్‌పూర్ వెళ్లాలంటే రానూ పోనూ 25 వేలు ఖర్చు అయ్యేది. మరింత చౌకగా సింగపూర్‌ వెళ్లే సదుపాయం అందుబాటులోకి రాగా కేవలం 14 వేలతోనే విమానంలో సింగ్‌పూర్ వెళ్లిరావచ్చు. అక్టోబరు నుండి విశాఖపట్నం సింగపూర్‌ మధ్య విమాన ప్రయాణం తక్కువకే అందు బాటులోకి రానున్నదని ఇది వరకే సమాచారం రాగా వారానికి 3రోజుల పాటు విమాన సర్వీసులు ఉండ బోతున్నాయి.

ఈ నేపత్యంలో విశాఖ సింగపూర్ల మధ్య కొత్త విమాన సర్వీసు మొదలైంది. ఈ విమాన సేవలు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన సంస్థ స్కూట్‌ తక్కువ ధరలలో సర్వీసు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సర్వీసును నిర్వహించబోతుంది. ఈ అయిదు రోజుల్లో రాత్రి 11 గంటలకు వైజాగ్‌ నుంచి బయలుదేరే విమానం, ఉదయం 5.40కి సింగపూర్‌ చేరుకుంటుంది. మళ్ళీ అదే రోజున సింగపూర్‌లో సాయంత్రం 8.45కి బయలుదేరి, రాత్రి 10 గంటలకు వైజాగ్‌ చేరుకుంటుంది.