సింగర్ సునీత మెహందీ ఫంక్షన్ ఎలా జరిగిందో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత నేడు (జనవరి 9) రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థ ఫొటోలను షేర్ చేశారు. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని తాను వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించారు సునీత.

ఇప్పటికే వీరి వివాహానికి సంబందించిన ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. నేడు పెళ్లి బంధంగా ఒక్కటి కాబోతున్న సునీత మెహందీ వేడుకకు సంబంధించిన వీడియోను  షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్‌లో సునీత మెహందీ ఫంక్షన్ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియోలో కొత్త పెళ్లి కూతురుగా సింగర్ సునీత చేతులకు మెహందీ పెట్టుకుని సిగ్గుపడుతూ కనిపించారు.

సునీత వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ సుమ, రేణు దేశాయ్ మరికొంత మంది సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తోంది.