రెబల్ స్టార్ “రాధేశ్యామ్” టీజర్ ఎలా ఉండబోతుంది ?

రెబల్ స్టార్ “రాధేశ్యామ్” టీజర్ ఎలా ఉండబోతుంది ?

కరోనా కారణంగా చాల బిజినెస్ లు ఓపెన్ చేయలేకపోయారు దాంతో ఆర్థికపరంగా నష్టపోయినవాళ్లు ఉన్నారు . అందులో ముక్యంగా సినీ ఇండస్ట్రీ ఒకటి . చాల రోజుల తర్వాత న్యూ మూవీస్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి . ఇప్పటికే పలు ఆసక్తికర చిత్రాల టీజర్ లు రావడం కూడా మొదలయ్యాయి. కానీ మన టాలీవుడ్ నుంచే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్స్ విడుదల కావాల్సి ఉంది. మరి ఆ టీజర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన “రాధేశ్యామ్” టీజర్ కూడా ఒకటి.

ఈ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే టీజర్ కు సంబంధించి ఓ ఆసక్తికర టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ టీజర్ ను మేకర్స్ చాలా తక్కువ నిడివిలోనే అంటే ఓ 30 సెకండ్స్ లో స్వీట్ అండ్ సింపుల్ గా తేల్చేస్తారట. ఇందులోనే ఈ సినిమా థీమ్ ను అమేజింగ్ గా చూపించనున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ టీజర్ కోసం మాత్రం చాలానే ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఆ బిగ్ అనౌన్సమెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.