ఘనంగా ప్రముఖ సింగర్ సునీతా వివాహం .

ఘనంగా ప్రముఖ సింగర్ సునీతా వివాహం .

శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ఆలయంలో టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని తనకు అందమైన జీవితం ప్రసాదించమని సునీత కోరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 9న రామ్‌ వీరపనేనితో కలిసి ఆమె ఏడడుగులు వేసింది.

ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. యంగ్ హీరో నితిన్ తన భార్య శాలినితో కలిసి రావడం విశేషం. సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.