కేసు పెట్టిన శివబాలాజీ భార్య.. అసలు వివాదం ఇది

Siva Bajial files complaint over online abuse targetting wife

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దాదాపు దశాబద్ద కాలంకు పైగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న శివబాలాజీకి రాని గుర్తింపు ‘బిగ్‌బాస్‌’ మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన వెంటనే దక్కింది. శివబాలాజీ భార్య మధుమిత కూడా పలు చిత్రాల్లో నటించి నటిగా తనను తాను నిరూపించుకున్న విషయం తెల్సిందే. శివబాలాజీ బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న సమయంలో మధుమిత తన భర్తకు మద్దతు ఇవ్వాలంటూ పలువురికి సందేశాలు పంపించేది. తన భర్తకు ఓటు వేయాలని ఆమె పలువురిని కోరడం జరిగింది. ఆ సమయంలోనే మధుమిత ఫోన్‌ నెంబర్‌ పబ్లిక్‌గా తెలిసి పోయింది.

అప్పటి నుండి కూడా మధుమితకు కొందరు ఆకతాయిలు అశ్లీల పదాలతో మెసేజ్‌ు చేయడం మరియు కామెంట్స్‌ చేయడం చేస్తున్నారట. కొందరు కాల్స్‌ చేసి మరీ అసభ్యంగా మాట్లాడుతున్నారు. సోషల్‌ మీడియాలో కూడా శివబాలాజీ మరియు మధుమితలపై ఘాటు వ్యాఖ్యలు, పుకార్లు రాస్తున్నారు. వీరి సంసార జీవితం సాఫీగా సాగిపోతున్న ఈసమయంలో ఇలాంటి మెసేజ్‌లు మరియు వ్యాఖ్యలు మంచిది కాదు. అందుకే శివబాలాజీ మరియు మధుమితలు కలిసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమను ఆన్‌లైన్‌లో మరియు ఫోన్‌లో వేదిస్తున్నారని, అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేస్తున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ఎంక్వౌరీ చేస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. సెలబ్రెటీలకు ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.