అనాథ శ‌ర‌ణాల‌యానికి ప్రైజ్ మ‌నీ

hero-siva-balaji-donated-bigg-boss-winner-prize-money-to-orphanage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చివ‌రిదాకా ఉత్కంఠ‌గా సాగిన బిగ్ బాస్ లో అంద‌రినీ వెన‌క్కినెట్టి విజేత‌గా నిలిచిన శివ‌బాలాజీ రూ. 50 ల‌క్షల ప్రైజ్ మ‌నీ అందుకున్నాడు. ప‌న్నులు అన్నీ మిన‌హాయించ‌గా…ఆయ‌నకు రూ.35 ల‌క్ష‌లు మిగిలాయి. ఈ భారీ మొత్తాన్ని శివ‌బాలాజీ ఎలా ఉప‌యోగిస్తాడు అన్న‌ది అంద‌రికీ క‌లిగిన సందేహం. ఇలాంటి కార్య‌క్ర‌మాల విజేత‌లు జ‌న‌ర‌ల్ గా..తమ ప్రైజ్ మ‌నీతో ఏం చేస్తామో ముందుగానే చెబుతుంటారు. శివ‌బాలాజీని కూడా ఈ ప్ర‌శ్న అడిగిన‌ప్పుడు వేదిక‌మీద ప్ర‌క‌ట‌న చేస్తానని చెప్పాడు శివ‌బాలాజీ. కానీ గ్రాండ్ ఫినాలే వేడుక స‌ర‌దాలో ఆ విష‌యం అంద‌రూ మ‌ర్చిపోయారు. అయితే ఈ ప్రైజ్ మ‌నీని శివ‌బాలాజీ ఓ అనాథ శ‌ర‌ణాల‌యానికి విరాళంగా అంద‌జేశాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. శివ‌బాలాజీ శ్రీమంతుల కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో రూ.35 ల‌క్ష‌ల‌ను సామాజిక సేవ‌కు వినియోగించాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఇదే నిజ‌మైతే….బిగ్ బాస్ షోనే కాదు..అంద‌రి మ‌న‌సుల‌నూ ఆయ‌న గెలుచుకున్న‌ట్టే.