యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్కంద ట్రైలర్..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్కంద ట్రైలర్..
Movie News

అఖండ మూవీ తో సంచలన విజయం సాధించిన బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ తో స్కంద అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను తన స్టైల్ లో ఈ మూవీ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పోస్టర్ దగ్గర నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్కంద. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.

 యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్కంద ట్రైలర్..
Ram pothineni

రామ్ పోతినేని నటిస్తున్న మాస్ మసాలా మూవీ స్కంద. ఇస్మార్ శంకర్ మూవీ తర్వాత సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న రామ్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను స్టైల్ లో ఈ మూవీ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ ట్రైలర్ పై పలు ట్రోల్స్ కూడా వస్తూనే ఉన్నాయి . గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘దమ్ము’ ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ ‘వినయ విధేయ రామ’ మూవీ లు కలిపి ఈ సినిమాలో చూపించినట్టు ఉంది అంటూ ట్రోల్స్ వచ్చాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీ ను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.