నాగార్జున నా సామిరంగ లో హీరోయిన్స్ ఫిక్స్… ఎవరంటే..?

నాగార్జున నా సామిరంగ లో హీరోయిన్స్ ఫిక్స్… ఎవరంటే..?
Movie News

ఆరుపదులు వయసులో కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ కుర్ర హీరోలకి పోటీగా నిలుస్తున్నారు హీరో నాగార్జున. వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. అయితే నాగ్ కి గత కొన్ని రోజులు నుండి కూడా మంచి హిట్లు మాత్రం దొరకట్లేదు. నాగర్జునకి అలానే నాగార్జున కొడుకులకి కూడా సరైన హిట్టు మాత్రం లభించలేదు. గత కొన్నాళ్ల నుండి అక్కినేని హీరోలకి దురదృష్టమే నడుస్తోంది. నాగార్జున హీరోగా వచ్చిన ది గోస్ట్ మూవీ పెద్ద ఫ్లాప్ అయింది.

నాగార్జున నా సామిరంగ లో హీరోయిన్స్ ఫిక్స్… ఎవరంటే..?
Nagarjuna

అయితే నాగర్జున ఇప్పటివరకు కూడా ఏ సినిమాని ప్రకటించలేదు కానీ తన పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త మూవీని అనౌన్స్ చేశారు. టైటిల్ నా సామిరంగ అని ఫిక్స్ చేశారు అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ని కూడా ఫైనల్ చేసేసారు. మరి హీరోయిన్లు ఎవరనే విషయానికి వస్తే కన్నడ బ్యూటీ ఆశిక రంగనాథ్ అలానే మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ బన్నీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.