కేవలం నిమిషంలోనే స్మార్ట్‌ఫోన్ల అమ్మకం

కేవలం నిమిషంలోనే స్మార్ట్‌ఫోన్ల అమ్మకం

స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం హానర్‌ విడుదల చేసిన హానర్‌ 50, హానర్‌ 50 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు కేవలం నిమిషంలోనే అమ‍్ముడయ్యాయి. ఈ అమ్మకాల్ని హానర్‌ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స‍్థాయిలో 2జీ, 4జీ, ఇప‍్పుడు 5జీ విప్లవం మొదలైంది. దీంతో స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ 5జీ స్మార్ట్‌ ఫోన్ల తయారీ పై దృష్టిసారించాయి.

ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేయగా తాజాగా హువాయే సబ్‌ బ్రాండ్‌ గా పేరొందిన హానర్‌ కంపెనీ చైనా కేంద్రంగా హానర్‌ 50, హానర్‌ 50ప్రో, హానర్‌ 50ఎస్‌ఈ ఫోన్లపై శుక్రవారం రోజు ఫ్రీ ఆర‍్డర్‌ను ప్రకటించింది. అలా ఆర్డర్‌ ప్రకటించింది లేదో కేవలం నిమిషం వ్యవధిలోనే హానర్‌ 50 సిరీస్‌ ఫోన్లు అమ్ముడయ్యాయి.