క్యాన్సర్‌ బారిన పడ్డ స్టార్ హీరోయిన్‌

sonali bendre diagnosed with High Grade cancer

తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన సోనాలి బింద్రె క్యాన్సర్‌తో బాధపడుతుంది. ప్రస్తుతం సోనిలి బింద్రె అమెరికా న్యూయార్స్‌లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ కాలం, ఎంతో బాధగా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఆధరిస్తున్న కారణంగా వాటన్నింటిని తట్టుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. అందరి ప్రేమానురాగాలతో క్యాన్సర్‌ను జయిస్తాను అనే నమ్మకం ఉందని ఆమె పేర్కొంది. సోనాలి బింద్రె క్యాన్సర్‌ విషయం ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా తీవ్రంగా కలచి వేసింది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన సోనాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం బాధను కలిగిస్తుందని సినీ ప్రముఖులు కూడా అంటున్నారు.

గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయితే ఎక్కువ శాతం మంది క్యాన్సర్‌ను జయించారు. అలాగే సోనాలి కూడా క్యాన్సర్‌ను జయిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సోనాలి తనకు వచ్చిన క్యాన్సర్‌ ఏ రకమైనది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. మీ అందరి ప్రోత్సాహంతో తప్పకుండా క్యాన్సర్‌ను జయిస్తాను అనే నమ్మకంను వ్యక్తం చేసింది. చిరంజీవి, మహేష్‌బాబు, బాలకృష్ణ ఇంకా పలువురు స్టార్‌ హీరోల సరసన చిత్రాలు చేసిన సోనాలి బింద్రె హిందీలో కూడా పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను చేసింది. ఈమద్య ఈమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇలాంటి సమయంలో క్యాన్సర్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. క్యాన్సర్‌ మొదటి స్టేజ్‌ అయ్యి ఉంటుందని, తప్పకుండా ఆమె తిరిగి వచ్చి హిందీ చిత్రాల్లో నటిస్తుందనే నమ్మకంను ఒక బాలీవుడ్‌ నటుడు వ్యక్తం చేశాడు. అతడు అన్నట్లుగా జరగాలని అంతా కోరుకుంటున్నారు.