శ్రీదివ్య కూడా రెడీ అనేసింది

Sri Divya Ready To Do Glamour Roles

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగమ్మాయి శ్రీదివ్య టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయినప్పటికి తమిళంలో ఆమెకు ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. పలు పెద్ద సినిమాల్లో నటించిన ఆమె తమిళనాట స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఎన్ని సక్సెస్‌లు వచ్చినా కూడా శ్రీదివ్య కెరీర్‌ ఇటీవల కాస్త డల్‌ అయ్యింది. కారణం ఆమె గ్లామర్‌ పాత్రలకు నో చెప్పడమే అని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా చాలా పద్దతిగా, ఏమాత్రం అందాల ప్రదర్శణ లేకుండా జాగ్రత్త పడటం జరిగింది. ఇప్పుడు అలా ఉంటే కెరీర్‌ ముందుకు సాగే అవకాశం లేదని ఆమె కూడా భావించింది. అందుకే అందరిలా మారిపోవాలని, సినిమాల్లో కొనసాగాలంటే కొన్ని వదులుకోవాలని నిర్ణయించుకుని, అలా ముందుకు సాగాలని భావిస్తుంది.

ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలకు, అందాల ప్రదర్శణకు ఆమడ దూరంలో ఉన్న శ్రీదివ్య ఇక ఎలాంటి కాస్ట్యూమ్స్‌లో అయిన నటించాలని నిర్ణయించుకుంది. పాత్ర డిమాండ్‌ చేస్తే, ఆ సీన్‌కు గ్లామర్‌గా కనిపించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా తాను అందాల ప్రదర్శణకు సిద్దం అంటూ ప్రకటించింది. దాంతో ఇప్పుడు శ్రీదివ్యతో తమిళంకు చెందిన పలువురు నిర్మాతలు బేరసారాలు ఆడుతున్నారు. సీన్‌ డిమాండ్‌ చేస్తే తప్పకుండా సినిమాలో బికిని వేసేందుకు కూడా సిద్దం అంటూ ప్రకటించింది. త్వరలోనే శ్రీదివ్యను బికినీలో చూస్తామేమో అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటి వరకు గ్లామర్‌గా కూడా నటించేందుకు ఆసక్తి చూపించని ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా బికినీలో కనిపిస్తే ప్రేక్షకులు షాక్‌ అవుతారేమో. తమిళనాట బికినీలో నటించేందుకు ఓకే చెప్పిన శ్రీదివ్య తెలుగులో మాత్రం అలాంటి పాత్రలు చేయక పోవచ్చు అంటున్నారు.