చెప్పుతో కొడతా ఆది..!

sri reddy comments on Hyper Aadi Latest Skit

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చింది. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా సినీ ప్రముఖులందరిని టార్గెట్‌ చేస్తూ మీడియాలో పదే పదే కనిపించిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకే పరిమితం అయ్యింది. తాను చేస్తున్న కార్యక్రమాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా పోస్ట్‌ చేసిన ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఆ వీడియోలో హైపర్‌ ఆదిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తనపై వ్యాఖ్యలు చేస్తున్న ఆదిని చెప్పుతో కొడతాను అన్నట్లుగా హెచ్చరించింది. తనపై విమర్శలు చేసే ఏ ఒక్కరిని కూడా వదలను అంటూ శ్రీరెడ్డి ఘాటుగా హెచ్చరించింది.

ఇటీవల జబర్దస్త్‌ స్క్రిప్ట్ లో ఆది ఒకానొక సమయంలో శ్రీరెడ్డిపై పంచ్‌ వేశాడు. షర్ట్‌ విప్పుతానంటే అంతర్జాతీయ మీడియా కూడా క్యూ కడుతుంది అంటూ ఆది వేసిన పంచ్‌ డైలాగ్‌ శ్రీరెడ్డి గురించి అంటూ అందరు గుర్తించారు. అదే విషయాన్ని శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ ఆదిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తాను డ్రస్‌ విప్పింది సెక్స్‌ కోసం కాదని, తాను ఒక విషయమై పోరాడాను అని, అందుకోసం విప్పాను అంటూ చెప్పుకొచ్చింది. ఆది తనపై వేసిన పంచ్‌కు జడ్జ్‌లు నవ్వడం కూడా ఆమెకు కోపం తెప్పించింది. ఆది గతంలో కత్తి మహేష్‌పై విమర్శలు చేస్తూ, పంచ్‌లు వేశాడు. ఇప్పుడు నన్ను టార్గెట్‌ చేశాడు. ఇలాగే ఆది కంటిన్యూ అయితే నీ మీద నా ఒక్క చెప్పు మాత్రమే కాదు, వందల చెప్పులు పడతాయి. నిన్ను మామూలుగా కొట్టను, నాకు వస్తున్న కోపంకు నా ఎదురుగా నువ్వు ఉంటే ఏం చేసేదాన్నో.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇస్తున్న జబర్దస్త్‌ అంటే తనకు గౌరవం ఉందంటూనే ఆదిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది. మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఆది ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.