గాడి తప్పిన శ్రీ రెడ్డి !

శ్రీరెడ్డి, కొద్ది రోజుల క్రితం వరకు ఈపేరు అంటే తెలియని తెలుగు వారు ఉండే వారు ఏమో కానీ, ఆమె గత కొద్ది రోజులుగా యూట్యూబ్ లోచేస్తున్న హల చల్ కి ఆమె తెలుగు రాష్ట్రాల్లో హాట్ న్యూస్ గా మారిపోయింది. తెలుగు అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, వదులుతోన్న లీక్ లు సిని ఇండస్ట్రీ లో కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.

సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అంటూ పలువురు సినీ ఇండస్ట్రీ వ్యక్తుల పేర్లు సైతం బయట పెట్టిన శ్రీ రెడ్డి. ఇప్పుడు తెలుగు బుల్లి తెర మీద కూడా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. దశాబ్ద కాలం పైగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ఒక దిగ్గజ ఛానెల్ మీద, దాని అధినేత మీదా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు టెలివిజన్ సర్కిల్స్ లో పెను దుమారాన్నే రేపాయి.

శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణల ప్రకారం సదరు చానెల్ కొన్ని టీవీ షో లని నిర్వహిస్తోంది. అయితే ఆ షో లని ప్రొడ్యూస్ చేస్తోన్న వ్యక్తి షో కోసం వచ్చే అమ్మాయిలని మభ్యపెట్టి వాడుకుంటారు అని, ఈ విషయంలో ఆ వ్యక్తికి ఆయన భార్య మంచి సపోర్ట్ అని, వారు అదే సంస్థ కి వెన్నుముక వంటి వ్యక్తి పేరు వాడుకుని అవాకాశాలు ఇప్పిస్తామని మభ్య పెడతారు, ఎదో ఒక షో లో కనపడక పోతామా అంటూ వచ్చిన ఆడపిల్లలని వేరేవేరే పనుల కోసం వాడతారు అని శ్రీ రెడ్డి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని సదరు ఛానెల్ యాజమాన్యం దృష్టికి తెసుకెళ్ళడమే లక్ష్యంగా శ్రీ రెడ్డి పేర్కొంది.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా శ్రీ రెడ్డి కొన్ని లాజిక్స్ మిస్ అయ్యిందనే చెప్పుకోవాలి, ఎందుకంటే శ్రీ రెడ్డి పేర్కొన్న దిగ్గజ ఛానెల్ అధినేతకి ఆమె నేరుగా లేఖ లాంటిది వ్రాసి ఉండవచ్చు, లేదా ఆమె నేరుగా ఆయా అప్పాయింట్ మెంట్ తీసుకుని కలిసి పరిస్థితి వివరించవచ్చు, కాని ఇవేమీ చేయకుండా ఆమె కేవలం ఒక ఫేస్బుక్ బుక్ పేజి ద్వారా కొన్ని ఆరోపణలు చేస్తే సరిపోతుందా, ఒక వేళ ఆ దంపతులు నిజంగా తప్పులకి పాల్పడుతూ ఉంటె అధినేత దృష్టికి నేరుగా తీసుకెళ్ళి ఉంటె పరిస్థితి వేరేగా ఉండే దేమో ?

కాని అలా కాకుండా కేవలం ఆరోపణలు చేయడం వల్ల, ఏమీ ఉపయోగం ఉండకపోవచ్చు. మీకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల బురద చల్లుతున్నారు అనుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకు అంటే మీరు ఆరోపణలు చేసిన సంస్థ అటువంటిది. ఒకానొక సమయంలో ఢిల్లీ నుండి వచ్చి సదరు ఛానెల్ లో న్యూస్ విభాగం లో పని చేస్తున్న ఒకామెకి ఎప్పటి నుండో ఛానెల్ లో పాతుకు పోయిన కొందరినుండి వేధింపులు ఎదురయి నప్పుడు ఆమె వ్రాసిన ఒక్క లేఖ వేధించిన అందరికీ ఉద్వాసన పలికేలా చేసింది.

అలాంటి సంస్థ మీద ముందూ వెనుకా చూడకుండా చల్లిన బురద వల్లన సదరు సంస్థ వారికి పెద్దగా నష్టం కలగకపోవచ్చు, కాని ఇలా ఆరోపణలు వచ్చిన సమయంలో వాటిని స్పురణలోకి తీసుకుని ఆ విషయం మీద విచారాణ జరిపి తగు నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే, ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్న చందాన ఇప్పటి వరకు ఛానెల్ కి ఉన్న మంచి ఇమేజ్ అటక ఎక్కే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటి కయినా అధినేత ఈ విషయం మీద ద్రుష్టి పెట్టకుండా ఉంటె జరగాల్సిన నష్టం జరుగక మానదు.