హైటెన్షన్‌ : మళ్లీ నానిని కెలికిన శ్రీరెడ్డి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి మరోసారి సంచలనంకు తెర లేపింది. కొన్ని రోజుల క్రితం నాచురల్‌ స్టార్‌ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి అందరికి కన్ఫ్యూజ్‌లో పడేసింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు నాని గురించేనా లేక మరొకరిపైనా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎక్కువ శాతం మంది నాని గురించే అని భావించినా కూడా నాని పేరు పెట్టలేదు కనుక అంతా లైట్‌ తీసుకున్నారు. కాని తాజాగా శ్రీరెడ్డి నాని పేరును ప్రస్థావించి ట్వీట్‌ చేసి సంచలనం సృష్టించింది. శ్రీరెడ్డి లీక్స్‌ పేరుతో శ్రీరెడ్డి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సినీ వర్గాలను కుదిపేస్తోంది. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అంటూ నానికి ఇండస్ట్రీలో పేరు ఉంది. కాని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయి.

శ్రీరెడ్డి తాజాగా ట్విట్టర్‌లో.. “తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాసుకోర నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెంకూడా సిగ్గులేదా అలా చేయటానికి ఛి” అంటూ ట్వీట్‌ చేసి సంచలనంకు తెర లేపింది. నానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా శ్రీరెడ్డి వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక వేళ శ్రీరెడ్డి ఆ విషయానికి సంబంధించి సాక్ష్యాలను భయటపెడితే నాని కెరీర్‌ నాశనం అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తిగా నానికి మంచి పేరు ఉంది. మరి ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి. నాని ఈ విషయంలో ఎలా స్పందిస్తాడు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

Sri Reddy Tweets On Nani