మన ఆడపిల్లలు ఊరికే పడిపోతారట… నోరుపారేసుకున్నబీజేపీ ఎమ్మెల్యే

BJP MLA Gopal Parmar controversy comments on child marriages

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొద్ది రోజులుగా సొంత పార్టీ నాయకుల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు బీజేపీకి తలవంపులు అరటి అధిష్టానానికి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోన్న సంగ‌తి తెలిసిందే. త్రిపుర సీఎం బిప్ల‌వ్ యువత మీదా, సివిల్ పరీక్షలు వ్రాసిన వారి మీదా చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా దుమారం రేప‌డం, తర్వాత జ‌ర్న‌లిస్టుల‌ను నార‌దుడితో పోలుస్తూ గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం దీంతో వారివురినీ ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు త‌న‌ను క‌ల‌వాల‌ని ప్ర‌ధాని ఆదేశించ‌డం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా, మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మర్… మ‌హిళ‌లు, బాల్య‌వివాహాల‌నుద్దేశించి మరిన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

‘మంచిగా మాట్లాడితే చాలూ కొత్త వాళ్లకైనా సరే మన అమ్మాయిలు ఇట్టే పడిపోతారని, అందుకే పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటల ఉదంతాలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి కాబట్టి అమ్మాయిల్ని కట్టడి చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అగర్‌ మాల్వా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గోపాల్‌ పర్మర్‌ శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మన ప్రభుత్వాలు అమ్మాయిలకు వివాహర్హత వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాయి. కానీ, ఇప్పుడు అదే కొంప ముంచుతోంది. తియ్యటి మాటలకు మన అమ్మాయిలు సులువుగా వలలో పడిపోతారు. ఆ సమయంలో వాళ్లకు ఆలోచించే శక్తి ఉండదు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

లవ్‌ జిహాదీ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి, తల్లులు వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. లవ్‌ జిహాద్‌ నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది’ అని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. త‌న‌కు కూడా 12 ఏళ్ల‌కే పెళ్ల‌యింద‌ని, తాను చాలా సంతోషంగా ఉన్నాన‌ని అన్నారు. అయితే, పర్మర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. ఆయన మాటల పై స్పందించిన కొన్ని విద్యార్ధి సంఘాలు భోపాల్ హైవేను దిగ్బంధించాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రేమికుల రోజు వస్తే తాళిబొట్లు పట్టుకుని తిరుగుతూ అమాయకులకు దౌర్జన్యంగా పెళ్లిళ్లు చేస్తున్న భజరంగ్ దళ లాంటి వారిని ఏమీ ఎనలేని వారు ఆడపిల్లల మీద నోరు పారేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.