తుపాకులతో డ్యాన్స్..ఎమ్మెల్యేపై ఆరేళ్ల వేటు

bjp has expelled kunwar pranav singh champion for six years

న్యూఢిల్లీ: మద్యం సేవిస్తూ..చేతిలో తుపాకులు పట్టుకుని ఐటెంసాంగ్‌కు డ్యాన్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ ఉల్లంఘించి..అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఉత్త‌రాఖండ్‌కు చెందిన ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఓ హౌస్ పార్టీలో చేతిలో తుపాకులు ప‌ట్టుకొని అనుచ‌రుల‌తో బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో హ‌ల్‌చ‌ల్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రౌడీలా జ‌ల్సాలు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ ఘ‌ట‌న‌ను సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసింది.