సెల్ఫీ మోజు.. నదిలో పడ్డ యువకుడు

haryana man fall in the river

సిమ్లా : సెల్ఫీ మోజులో పడ్డ ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. హర్యానాకు చెందిన లలిత్‌ యాదవ్‌(25) హిమాచల్‌ప్రదేశ్‌ మనాలీలోని బియాస్‌ నది వద్దకు వచ్చాడు. ఆ నది వద్ద సెల్ఫీ దిగేందుకు యువకుడు ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది.. నీటిలో మునిగిన యువకుడిని కాపాడారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వచ్చే పర్యాటకులు, స్థానికులు నదుల వద్దకు వెళ్లొద్దని ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.