బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన బామ్మ

old woman imitating bumrah bowling

జస్‌ప్రిత్ బుమ్రా.. ఐసీసీ ఓడీఐ ర్యాంకింగ్స్‌లోనే టాప్ ర్యాంక్‌డ్ బౌలర్. ఐసీసీ వరల్డ్ కప్ 2019లోనూ తొమ్మిది మ్యాచుల్లో 18 వికెట్లను తీసి చరిత్ర సృష్టించాడు. బౌలింగ్‌లో బుమ్రా స్టయిలే వేరు. బుమ్రాది యూనిక్ బౌలింగ్. అందుకే.. ఆయనలా బౌలింగ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు.

తాజాగా.. తమిళనాడుకు చెందిన ఓ బామ్మ కూడా ఇలాగే బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసింది. ఆ వీడియోను ఓ యువతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన బుమ్రా కూడా ఆ వీడియోపై రెస్పాండ్ అయ్యాడు. ఈ వీడియో ఈరోజు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.. అంటూ ట్వీట్ చేశాడు. ఇక.. బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన బామ్మ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.