పార్కులో విరిగిన జాయ్ రైడ్ పైప్..ముగ్గురు మృతి..

three killed in pendulum ride breaks down inciden in ahmedabad

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ పార్కులో ప్రమాదం జరిగింది. పర్యాటకులు జాయ్ రైడ్ ఎక్కి ఎంజాయ్ చేస్తుండగా..పైప్ ఒక్కసారిగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా..26 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైనవారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నేత అర్జున్ మోత్ వాడియా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ టీం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది. గాయాలైనవారికి అవసరమైన చికిత్సనందిస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పార్కుల యాజమాన్యాలపై ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ముగ్గురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.