అమ్మాయి ఒప్పుకోకపోతే లేపుకొచ్చి పెళ్లి చేస్తా….బీజేపీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్ !

Bjp Mla Ram kadam Sensational Comments

బీజేపీ నేతల నోటి దురద వ్యాఖ్యలకు బ్రేక్‌ పడటం లేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ముంబై శివార్లలోనే ఘట్‌కోపర్ నియోజికవర్గంలో సోమవారం నిర్వహించిన కృష్ణాష్టమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యూత్‌ను ఆకట్టుకోవాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అబ్బాయిల్లో ఎవరినైనా కోరుకున్న అమ్మాయి కాదంటే, వారిని కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి మరీ మీకు అప్పగిస్తానని ముఖ్యమంత్రి సమక్షంలో ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముంబై శివార్లలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే, ఈ సందర్భంగా యువతతో ముచ్ఛటిస్తూ… యువకులకు ఏమైనా సమస్యలున్నాయా? చెప్పండి తీరుస్తానని హామీ ఇచ్చాడు.

Bjp Mla Ram kadam
అయితే అక్కడున్న కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయిలు, ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు చాలా కష్టంగా ఉంటోందని తమ అత్యంత పెద్ద సమస్య ఆయనతో చెప్పుకున్నారు. వారి బాధ విన్న ఆయన కామెడీగా అన్నారో ఎందుకు అన్నారో తెలీదు కానీ, వెంటనే  తన నంబర్ చెప్పి మీకు ఏ సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ చేసి ‘నేనో అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఆమె రిజెక్ట్ చేసింది.. దయచేసి సాయం చేయండి’ అని నన్ను వేడుకుంటే, నీకు సాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను. కాకపోతే మీ తల్లిదండ్రులతో విషయం చెప్పి మా అబ్బాయి, ఫలానా అమ్మాయిని ప్రేమించాడని నాకు చెప్పించండి వెంటనే ఆమెని కిడ్నాప్ చేసి మరీ మీ పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు.

Mla Ram kadam

రామ్ కదామ్ వ్యాఖ్యల వీడియోను ప్రత్యర్ధి పార్టీ అయిన ఎన్సీపీ ఎమ్మెల్యే ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయి నేషనల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. దీనిపై స్పందించిన రామ్ కదామ్… ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అమ్మాయిలు మీ ప్రేమను రిజెక్ట్ చేస్తే, వారి తల్లిదండ్రులను కలిసి ఒప్పించాలని యువకులకు చెప్పాను. రాజకీయ ప్రయోజనాల కోసం నా వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి ఉంటే ఆ సమయంలో అక్కడే ఉన్న జర్నలిస్టులు నన్ను తప్పుపట్టేవారు కదా ? అని ఆయన ఎదురు ప్రస్నిస్తునారు.