మోడీకి తలనొప్పిగా బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా…!

BJP MLA Akula Likely To Quit The Party

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని దానికి కారణం విభజన హామీలపై దారుణంగా వంచించడమేనని సాకుగా చూపుతూ ఆకుల సత్యనారాయణ తన రాజీనామా చేశారు. ప్రజలకోసం తాను బీజేపీని వీడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో .. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై మాట్లాడారు. ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా ప్రతి అంశంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం ఏపీని వంచించిందనే ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీలో మొదటి సారిగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేత తన అధిష్టానం మీదే నిరసన గళం విప్పారు. ఇంత వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విమర్శలు చేస్తూంటారు. దీనికి కౌంటర్‌ గా బీజేపీ నేతలు చాలా మాటలు మాట్లాడుతూంటారు.

ప్రధాని నుంచి సోము వీర్రాజు వరకు చంద్రబాబు వెన్నుపోటుదారు, లెక్కలు చెప్పని లెక్కల మాస్టర్ అంటూ చెప్పుకొస్తారు కానీ విభజన హామీల గురించి మాట్లాడరు. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా విమర్శలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు భారతీయ జనత పార్టీ అన్యాయం చేసిందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ తాము ఎంతో చేశామని బీజేపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా సొంత రాజకీయ ప్రయోజనాలు కోసమే. ప్రజల్లో ఏ మాత్రం పట్టు లేని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ప్రబుత్వం, బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చే పార్టీ పదవులపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారణంగా వీరు ఢిల్లీలోని తమ నాయకత్వాన‌్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానే అదే సమయంలో ప్రజల మనోభావాల్ని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం లేదు. ఈ నేపధ్యంలో ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.