ప్రభాస్ సినిమా టైటిల్ విషయంలో నోరు జారిన కన్నల్…!

Prabhas Radha Krishna Movie Title JAAN

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రన్ రాజా రన్ మూవీ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని కొంత విరామం తీసుకుంది. ఈ గ్యాప్ లో సాహో చిత్రా బృందం ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అద్దె పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ద కుమార్ కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదలైన సాహో మేకింగ్ వీడియో ను ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసి సినిమా అంచనాలు పెంచారు. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాహో చిత్రాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలవుతుంది. ఈ నేపద్యంలోనే ప్రభాస్ మరో చిత్రంలో నటిస్తున్నాడు.

జిల్ ఫేమ్ దర్శకుడు కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పెడుతున్నట్లు ఇటివల వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నా కనల్ కన్నన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… జాన్ మొదటి షెడ్యూల్ ఇటలిలో జరుపుకుంది. తర్వాత షెడ్యూల్ కోసం కొంత విరామం తీసుకుంది అన్నారు. దాంతో ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ సినిమా టైటిల్ జాన్ అనే విషయం బయటపడింది. దర్శకుడు ఈ చిత్రాని పిరియాడికల్ నేపధ్యం కలిగిన కథతో రూపొందిస్తున్నాడు. ప్రభాస్ ఈ చిత్రంలో కొత్త లుక్ లో కనిపిస్తాడు. ప్రభాస్ లుక్ ఏమిటి అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తారు. ఈ చిత్రాని ఈ ఏడాది చివరలో విడుదల చేస్తారు. జాన్ చిత్రం గ్యాప్ లో ప్రభాస్ సాహో చిత్రం సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.