అక్కడ మన సినిమా ఇరగదిస్తుంది…!

Simmba Movie Box Office Collection Day

పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం అప్పట్లో తెలుగు నాట ఘనవిజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాని బాలీవుడ్ లో దర్శకుడు కం ప్రొడ్యూసర్ రోహిత్ శెట్టి సింబా పేరుతో రీమేక్ చేశాడు. తెలుగు టెంపర్ లో ఉన్న సిన్స్ ను కాపీ చెయ్యకుండా స్క్రిప్ట్ ను చాలా వరకు మార్పులు చేస్తూ సినిమాను రూపొందించాడు. సింబా చిత్రంలో రణవీర్ సింగ్, సారా ఆలీఖాన్ జంటగా నటించారు. సింబా చిత్రాని గత ఏడాది డిసెంబర్ 28న విడుదల చెయ్యడం జరిగింది.

ఈ చిత్రం మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ దక్కించుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. మొదటి వారం పూర్తిచేసుకుని రెండోవ వారంలోకి ప్రవేశించిన సింబా చిత్రం 202కోట్ల వసూళ్ళు చేసింది. ఈ చిత్రానికి ఇప్పటివరకు అక్కడినుండి ఎటువంటి సినిమాలు పోటిగా రాకపోవడం సింబాకు కలిసి వచ్చే అంశం. రణవీర్ సింగ్ సినిమాలో బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకున్న చిత్రంగా సింబా నిలుస్తుంది. ఈ చిత్రాని కరణ్ జోహార్, రోహిత్ శెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఓ తెలుగు టెంపర్ రీమేక్ మూవీ బాలీవుడ్ లో సత్తా చాటడం సౌత్ సినిమాకు చాలా గర్వకారణం అంటున్నారు సినిమా విశ్లేషకులు. తెలుగు టెంపర్ ను తమిళంలో అయోగ్య పేరుతో మాస్ హీరో విశాల్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన విశాల్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నది.