మా పార్టీలోకి వస్తే పవిత్రులు అయిపోయినట్టే…!

BC Leader Buddha Nageswara Rao Joins YSRCP

ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో గోడ దూకుళ్ళు జోరందుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇస్తారో లేదోనన్న అనుమానం ఉన్న నేతలు ఆయా పార్టీలకు గుడ్‌‌బై చెప్పి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల కంటే వైసీపీకి, టీడీపీకే గట్టి షాక్‌లు తగులుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరగా ఆ తర్వాత పలువురు నేతల ఇదే బాటలో నడిచారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత బుద్దా నాగేశ్వర్రావు కూడా తీదీపెకి బాయ్ చెప్పి వైసీపీలో చేరిపోయారు. బీసీ ఉద్యమ నేత, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బుద్దా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

జగన్‌కు పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ పరిణామం తర్వాత ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావిడి చర్చనీయాంశం అవుతోంది. ఈ నాయకుడు గతంలో సంచలనం రేకెత్తించిని కాల్‌మనీ కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలో వైసీపీ నేతలు ఈయన మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సహా పలువురు కీలక నేతలు బుద్దా నాగేశ్వర్రావు సెక్స్ రాకెట్ నడుతున్నాడని, ఎందరో పేదల ప్రాణాలు పోడానికి కారణమని, అందుకే ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నేతలు బుద్దాపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. బీసీల హక్కుల కోసం ఎంతగానో పోరాటం చేశారని కొనియాడుతున్నారు. ఏమిటో మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అంటే ఇదేనేమో.