మహానటి ని ఎన్టీఆర్ అధిగమించేనా…?

NTR Kathanayakudu Box Office Prediction

నార్త్ సినిమా ఇండస్ట్రికె పరిచయం అయినా బయోపిక్ సినిమాలు ఇప్పుడు సౌత్ లోను జోరందుకున్నాయి. ఇప్పుడు వస్తున్నా కొత్త తరం దర్శకులు కూడా బయోపిక్ మూవీస్ పైన దృష్టి సాధిస్తున్నారు. బయోపిక్ లో ప్రముఖంగా తీసుకుంటుంది రాజకీయ నాయకులను, సినిమా స్టార్ లెజెండ్స్ ను ప్రముఖంగా తీసుకుని వాళ్ల గురుంచి ఇప్పటి తరంవాళ్ళకు తెలియాలని తెర రూపంలో చూపించేందుకు దర్శకులు ఆ వైపు కదం తొక్కుతున్నారు. తెలుగునాట బయోపిక్ కు పునాది వేసింది మాత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ అనే చెప్పాలి. మహానటి సావిత్రి జీవిత చరిత్రను తెలుసుకుని ఆమె జీవితంలో జరిగిన సంఘటనలను తెరరుపంలో ఆవిష్కరించాడు. ఇప్పటి స్టార్ హీరొయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించి అందరి దృష్టిలో జూనియర్ సావిత్రిగా ముద్ర వేసుకుంది.

మహానటి సావిత్రి సినిమాను చుసిన బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను ఎలాగైనా తెలుగు ప్రజలకు తెలియాలని ఆనాడే శపదం చేశాడు. అందుకే ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెర రూపంలోకి తీసుకువచ్చాడు. అందుకు సరైన మర్గానిర్దేషకుడు కావాలని తలచి గౌతమి పుత్రా శాతకర్ణి అందించిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్ అయితేనే కరెక్ట్ ని భావించి ఎన్టీఆర్ బయోపిక్ ను అతనికే అప్పజెప్పాడు. క్రిష్ మొదట అంతటి మహానుభావుడు జీవిత చరిత్రను ఒక్క భాగంలో చూపించలేముని భావించి రెండు భాగాలుగా రూపొందించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ రెండు భాగాలో మొదటి భాగం నిన్న విడుదలైంది. ఎన్టీఆర్ కథనయకుడులో సినిమా పరిశ్రమకు చెందినా స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ నటించారు. ఇప్పటి వరకు పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు ఎంతవరకు కలెక్షన్స్ చేసింది అనేది ఇంకో రెండు, మూడు రోజులో ఆధారాలతో సహా బయటకు వస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి మూవీ లో ఏలాంటి స్టార్ హీరోస్ లేకపోయినా 40కోట్లు సాదించింది. మరి ఎన్టీఆర్ బయోపిక్,మహానటి ని అధిగమిస్తుంద అనేది త్వరలో తెలియనున్నది.