బయోపిక్ అంటే డాన్సులు పాటలు కాదు: లక్ష్మి పార్వతి…!

Laxmi Parvathi Critics Bala Krishna Over NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో దర్శకుడు జాగర్లమూడి క్రిష్, నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను రూపొందించాడు . ఈ చిత్రంలో బాలకృష్ణ కథానాయకుడు గా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. బాలకృష్ణ సొంత బ్యానర్ లోనే అయనే నిర్మాతగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ చిత్రాని క్రిష్ రెండు భాగాలుగా రూపొందించాడు. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు ఈ చిత్రం నిన్న బుదవారం విడుదల చెయ్యడం జరిగింది. ఈ భాగంలో అందరు అనుకున్న విధంగానే ఎన్టీఆర్ బాల్యం అండ్ సినిమా జీవితాన్ని రూపొందించాడు. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ ను ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో ఫిబ్రవరి 7 న విడుదల చేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రోజే రాంగోపాల్ వర్మ తాను ఎన్టీఆర్ జీవితాన్ని రుపొందిస్తాను అన్నారు. అనుకున్న విధంగానే విజయదశమి రోజు లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు.

లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబందించిన నిర్మాణ పనులు చక చక జరుగుతున్నాయి. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు బుదవారం విడుదలైన రోజే వర్మ, లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎందుకు అనే పాటను విడుదల చేశాడు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. ఈ సందర్భంగా లక్ష్మి పార్వతి ఈ పాటపై స్పందించారు. ఎందుకు అనే సాంగ్ నన్ను విమర్శించినట్లు ఉన్న అందులో చాలా లోతైన అర్ధం ఉన్నది అది నన్ను ఎంతగానో కదిలించింది. ఎన్టీఆర్ జీవితం అంటే సినిమా రంగంలో ఎలా అవకాశాలు వచ్చాయి, ఎలా డాన్సులు వేశాడు అనేది కాదని. సినిమాలోకి రావడానికి ఎంత కష్ట పడ్డాడు. ఏలాంటి భాధలు అనుభవించాడు. ఎన్ని ఆఫీస్ ల చుట్టూ తిరిగాడు అనేది చూపించాలి అన్నారు. వర్మ తీసే లక్ష్మిస్ ఎన్టీఆర్ లో మాత్రమే అలాంటివి ఎక్కువగా ఉంటాయి వర్మ మాత్రమే ఎన్టీఆర్ గురుంచి నిజాలు చూపిస్తాడని లక్ష్మి పార్వతి అన్నారు. ఎందుకు అనే సాంగ్ విన్న తరువాత వర్మ పై మరింత గౌరవం పెరిగింది అన్నారు. లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అన్నారు.