ఎన్టీఆర్‌ గైర్హాజరుకు కారణం ఇదే

Rumors On NTR Not Attending Kalyan Ram Na Nuvve Movie Audio Release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కళ్యాణ్‌ నటించే ప్రతి సినిమా వేడుకలో కూడా ఇటీవల ఎన్టీఆర్‌ పాల్గొంటూ వస్తున్నాడు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అప్పుడప్పుడు ఏదో కారణం వల్ల ఎన్టీఆర్‌ పాల్గొనకుంటే సోషల్‌ మీడియాలో మళ్లీ అన్నదమ్ముల మద్య విభేదాలు అంటూ పుకార్లు మొదలవుతున్నాయి. ఇటీవలే కళ్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ తాజాగా కళ్యాణ్‌ రామ్‌ చిత్రం ‘నానువ్వే’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనలేదు. దాంతో కళ్యాణ్‌ రామ్‌ కోసం ఎన్టీఆర్‌ టైం కేటాయించలేక పోతున్నాడు. అన్ని కార్యక్రమాలకు వెళ్లే ఎన్టీఆర్‌ అన్న కార్యక్రమానికి మాత్రం రావడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు విమర్శలు ప్రారంభించారు. 

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఆ విమర్శలపై తాజాగా నందమూరి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు సమాధానం చెబుతున్నారు. ‘నానువ్వే’ ఆడియో విడుదల కార్యక్రమంకు ఎన్టీఆర్‌ హాజరు అవ్వాల్సి ఉంది. కాని చివరి నిమిషంలో వైజాగ్‌లో వ్యాపారవేత్త ఇంట్లో వివాహ వేడుకలో ఎన్టీఆర్‌ పాల్గొనాల్సి వచ్చింది. హరికృష్ణకు ఆప్త మిత్రుడు మరియు సీనియర్‌ ఎన్టీఆర్‌కు అభిమాన పాత్రుడు అయిన వ్యక్తి ఇంట్లో పెళ్లి అవ్వడం వల్ల ఎన్టీఆర్‌ తప్పనిసరిగా వెళ్లినట్లుగా వారు చెబుతున్నారు. అంత మాత్రాన కళ్యాణ్‌ రామ్‌కు ఎన్టీఆర్‌కు విభేదాలా అంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ సినిమా కోసం ఎప్పుడు ఎన్టీఆర్‌ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తాడు అని, వీలుంటే తప్పకుండా అన్న కోసం వస్తాడంటూ నందమూరి సన్నిహితులు చెబుతున్నారు.