చైతన్య రథం ఎక్కిన కళ్యాణ్‌ రామ్‌…!

Kalyan Ram Plays A Prominent Role In Ntr Biopic

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు క్రిష్‌ కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని ముగించాలనే పట్టుదలతో చిత్ర యూనిట్‌ సభ్యులందరిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. వరుసగా షెడ్యూల్స్‌ వేసుకుంటూ క్రిష్‌ ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇటీవలే బాలకృష్ణ, రానా, విద్యాబాలన్‌ ఇంకా పలువురు ప్రముఖ నటుల కాంబోలో సీన్స్‌ను తెరకెక్కించడం జరిగింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌లో మరో నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ జాయిన్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది.

bio-pic-ntr-kalyanram

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయన పెద్ద కొడుకు హరికృష్ణ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య రథయాత్రను నిర్వహించాడు. ఆ సమయంలో రథంను స్వయంగా హరికృష్ణ డ్రైవ్‌ చేయడం జరిగింది. కొన్ని వేల కిలోమీటర్ల పాటు ఆ రథంను హరికృష్ణ డ్రైవ్‌ చేయడంతో పాటు అప్పట్లో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అందుకే ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో హరికృష్ణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్రను అనామక నటుడితో చేయిస్తే వెయిట్‌ రాదనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్‌ ఆ పాత్రను కళ్యాణ్‌ రామ్‌తో చేయిస్తున్నాడు. హరికృష్ణకు సంబంధించిన ఎక్కువ సీన్స్‌ సినిమాలో ఉండబోవడం లేదు. కేవలం చైతన్య రథ యాత్ర సందర్బంగా మరియు రెండు మూడు ఇతర సీన్స్‌లలో మాత్రమే కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చైతన్య యాత్రకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుపుతున్న కారణంగా కళ్యాణ్‌ రామ్‌ రంగంలోకి దిగినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే పట్టుదతో క్రిష్‌ హడావుడిగా చిత్రీకరణ చేస్తున్నాడు.

kalyanram-ntr