మరోసారి లెజెండ్ ప్రాత్రలో క్రిష్…!

Balakrishna NTR Biopic KV Reddy Charectar

బాలకృష్ణ, క్రిష్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో చాలా మంది టాలీవుడ్ కు చెందినా స్టార్స్ అలనాటి స్టార్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుండి మరో వార్త వినపడుతుంది. అదే దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో కేవీ రెడ్డి పాత్రల్లో నటిస్తున్నాడట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానటి చిత్రలో దర్శకుడు కేవీ రెడ్డి పాత్రల్లో క్రిష్ నటించినా సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పాత్రను తనే స్వంతగా తన చిత్రంలో దర్శకుడు కేవీ రెడ్డి పాత్రల్లో నటిస్తున్నాడు.

 

Balakrishna NTR Biopic KV Reddy Charectar

కేవీ రెడ్డి గారికి, ఎన్టీఆర్ గారికి మంచి అనుబందం ఉన్నది. ఎన్నో హిట్ట్ చిత్రాలను అందించాడు ఎన్టీఆర్ కి. కేవీ రెడ్డి జీవితం చివరలో ఎన్నో కష్టాలు పడ్డాడు దుర్లబమైన జీవితాన్ని అనుబవించాడు. అప్పుడు ఎన్టీఆర్ గారే స్వయంగా సహాయం అందించ్చారు. కేవీ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని ఎన్టీఆర్ బయోపిక్ లో క్రిష్ చుపించానున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా విదుదల చేస్తున్నారు. మొదటి భాగం కథానాయకుడు పేరుతో జనవరి 9న, రెండవ భాగం మహానాయకుడు పేరుతో జనవరి 24 న విడుదలవుతుంది. ఈ చిత్రానికి బుర్ర్ర సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు.