నంద‌మూరి హీరో టైటిల్ లోగో విడుద‌ల‌

nandamuri hero title logo released

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ త‌న 17వ చిత్రాన్ని సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ రోజు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్‌ లోగోని వీడియో ద్వారా రివీల్ చేశారు. ఎంత మంచివాడ‌వురా అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేశారు. ఈ వీడియోలో క‌ళ్యాణ్ రామ్ లుక్‌ని రివీల్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. కాగా ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే హీరో కల్యాణ్‌రామ్ మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ సినిమా ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం కానున్నట్లు తెలుస్తున్నది. సరికొత్త నేపథ్యంలో విభిన్నమైన పాత్ర చిత్రణతో సాగే ఈ చిత్రానికి రావణ అనే టైటిల్‌ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.