సాహో ఫ‌స్ట్ సాంగ్ టీజ‌ర్ వ‌చ్చేసింది

saaho first song teaser

ప్ర‌భాస్, సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ సాహో. ఏకంగా 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటని ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో ఓ పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా చిత్రంలోని తొలిపాట టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. సైకో స‌యాన్ అంటూ సాగే ఈ పాట ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాల‌కి సంబంధించిన విజువ‌ల్స్ ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నాయి. ఈ సాంగ్‌ని జూలై 8న విడుద‌ల చేయ‌నున్నారు.